ఆముదం మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా…?

-

మనం ఆముదాన్ని అనేక రకాలుగా ఉపయోగించ వచ్చు. దీని వల్ల మనకి కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి పొడుగు జడ అంటే చాలా ఇష్టం. అటువంటి పొడవాటి జడని పొందాలి అంటే ఆముదాన్ని ఉపయోగించాల్సిందే..! తలకి ఆముదాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు తెగిపోవడం, బలహీనంగా ఉండడం, రాలిపోవడం మొదలైన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది.

అటు జుట్టుని… ఇటు చర్మాన్ని కూడా కాపాడుతుంది ఆముదం. ఇక దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయానికి వస్తే… చర్మం పై ఏమైనా మంటలు వంటివి వస్తే ఇది చక్కటి ఉపశమనం ఇస్తుంది. కాస్త ఆముదం దూదితో ముంచి ఎక్కడైతే మంట ఉంటుందో అక్కడ అప్లై చేయండి. ఆ తరువాత గంట పోయాక గోరు వెచ్చటి నీటి తో కడిగేసుకోండి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

యవ్వనంగా కనిపించడానికి కూడా ఆముదం బాగా పని చేస్తుంది. అలానే మాయిశ్చరైజర్ గా కూడా ఇది ఉపయోగ పడుతుంది. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ ఆముదాన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేస్తే మాయిశ్చరైజర్ గా ఇది పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ప్రత్యేకించి మాయిశ్చరైజర్ ను కొనుగోలు చేయక్కర్లేదు. అలానే ముడతలు రాకుండా ఉండేందుకు ఆముదం సహాయ పడుతుంది కూడా. చర్మానికి అవసరమైన పోషకాలు కూడా ఇది అందిస్తుంది.

ఆముదాన్ని ముఖానికి రాయడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి. వెంటనే తగ్గక పోయినా క్రమంగా అవి తగ్గి పోతాయి. కాబట్టి ఆముదాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ కలుగుతాయి. స్ట్రెచ్ మార్కులు కూడా ఇది పోగొడుతుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం మీరు ఆముదాన్ని స్ట్రెచ్ మార్క్స్ పైన రాయడం వల్ల అవి క్రమంగా చర్మం లో కలిసిపోతాయి.

చుండ్రును తగ్గించడానికి కూడా ఆమోదం భలేగా పని చేస్తుంది. చుండ్రు, స్కాల్ప్ పొడిగా ఉండడం, పొట్టు రాలడం వంటి సమస్యలను ఇది చిటిక లో తరిమికొడుతుంది. జుట్టు పొడవుగా బలంగా తయారవ్వాలంటే గోరు వెచ్చని ఆముదాన్ని వారం లో రెండు సార్లు రాసుకోండి. దీని వల్ల చక్కటి ఫలితం మీకు కనిపిస్తుంది. జుట్టు బలంగా తయారవుతుంది జుట్టు తెల్లబడకుండా కూడా ఇది పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news