చిల్డ్‌ బీర్‌ విత్‌ సిగిరెట్‌..వేడి వేడి స్టఫ్‌.. కాంబినేషన్‌ సిట్టింగ్‌కు కాదు.. క్యాన్సర్‌కు సెట్‌..

-

క్యాన్సర్‌ ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికీ తెలుసు.. కానీ అది రాకుండా జాగ్రత్తపడటం మాత్రం కొందరికే సాధ్యం.. అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌తోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చిల్డ్‌బీర్‌, విత్‌ సిగిరెట్‌..పక్కనే వేడి వేడి స్టఫ్‌.. కాంబినేషన్‌ అదిరింది కదూ.. రాత్రి టైమ్‌లో టెర్రస్‌ పైన కుర్చోని తాగుతుంటే.. అబ్బో.. ఈ కాంబినేషన్‌ ఆనందానికి కాదు.. అన్నవాహిక క్యాన్సర్‌కు బాగా సెట్‌ అవుతుంది అంటున్నారు నిపుణులు..
నివేదికల ప్రకారం.. సుమారు 200 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు నేడు ప్రపంచంలో ఉన్నాయి. క్యాన్సర్‌ను వెంటనే గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. చికిత్స చేయకపోతే, అది ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపించి చివరికి మరణానికి దారి తీస్తుంది. క్యాన్సర్ బారినపడి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకున్న చాలా మంది ప్రాణాలతో బయటపడగలిగారు..
అనేక రకాల క్యాన్సర్లలో ఈసోఫాగియల్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది అన్నవాహిక లోపలి శ్లేష్మం పొరలో మొదలయ్యే క్యాన్సర్. అన్నవాహిక మీ గొంతు నుండి పొట్టకు వెళ్లే పొడవైన గొట్టం లాంటి భాగం. మీరు మింగిన ఆహారాన్ని మీ కడుపుకు తరలించడంలో ఇది సహాయపడుతుంది.
అన్నవాహిక క్యాన్సర్‌కు కారకం మీరు అనుసరించే జీవనశైలి.. ఈ రకమైన క్యాన్సర్ స్త్రీలతో పోలిస్తే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి…ధూమపానం, ఆల్కహాల్, క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి అలవాట్లు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతాయి.

అన్నవాహిక క్యాన్సర్‌కు కారకాలు..

ఆహారం

మీరు తినే కొన్ని రకాల ఆహార పదార్థాల కారణంగా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ప్రాసెస్ చేసిన మాంసం తింటే అన్నవాహిక క్యాన్సర్‌ను అభివృద్ధి చేస్తుంది.. మరోవైపు, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఇవి అన్నవాహిక క్యాన్సర్‌ను నిరోధిస్తాయి..

వేడి పానీయాలు తాగడం

వేడివేడిగా టీ లేదా కాఫీలను తాగడం, వేడి నీరు, ఇతర వేడి పానీయాలు తాగడం వలన అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.. వాటిలోని కెఫిన్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల చాలా వేడిగా తాగకుండా, గోరువెచ్చగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామం చేయకపోవడం

మనల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి శారీరక శ్రమ చాలా అవసరం.. మీరు కుర్చోనే పనిచేసేవాళ్లు అయితే.. రోజు ఒక అరగంట పాటైన వ్యాయామం చేయడం నియమంగా పెట్టుకోండి.. క్రమం తప్పకుండా సాధారణ మోతాదులో శరీరానికి శ్రమ కల్పించడం ద్వారా కూడా వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చు. ఇది అన్నవాహిక క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొగాకు- మద్యం

కొంతమంది మద్యం సేవిస్తూ సిగరెట్లు కాలుస్తుంటారు. అసలు ఈ కాంబినేషన్‌ మద్యం ప్రియులకు చాలా ఇష్టం.. అయితే ఈ కాంబినేషన్ చాలా డేంజర్ అని వైద్యులు అంటున్నారు. ఇది అన్నవాహికతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు కారణం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు పీల్చడం, పొగాకు నమలడం వంటివి అన్నవాహిక క్యాన్సర్‌కు ముఖ్యమైన ప్రమాద కారకం. పొగాకు వాడకం మాదిరిగానే, ఎవరైనా ఎంత ఎక్కువ ఆల్కహాల్ తాగితే, వారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఊబకాయం

అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయులకు గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉండటం దీనికి కొంత కారణం. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే GERD అనే చాలా సాధారణమైన వ్యాధి, ఈ సమస్య ఉన్న ప్రతీ ఒక్కరికి అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news