కొత్తి మీర గురించి తెలిస్తే… మైండ్ బ్లాక్…!

-

చాలా మంది కొత్తి మీరను ఎక్కువగా వంటల్లో మాత్రమే వాడుతూ ఉంటారు. ఎక్కువగా సువాసనకు వాడుతూ ఉంటారు గాని కొత్తి మీర వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియని నిజం. దాని వలన చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. చాలా ఆరోగ్య సమస్యలకు కొత్తి మీర అనేది పరిష్కారం చూపిస్తుంది. అందుకే కొత్తి మీర వాడటం అనేది చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

విష వ్యర్థాలకు చెక్ పెడుతుందని అంటున్నారు. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో… అవి మన శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయని అంటున్నారు. కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి… ఇక కొత్తి మీరా వాడితే క్యాన్సర్ కూడా రాదు.

గుండెకు చాలా మేలు చేస్తుందని అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుందని అంటున్నారు. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియం (ఇది గుండెకు ప్రమాదం)ను బయటకు పంపిస్తుంది.

కొత్తి మీర వలన ఇన్ఫెక్షన్లతో వచ్చే అవకాశాలు ఉండవు. సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉండటంతో… మనకు చాలా ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఇక ఆహారం కల్తీ అయినప్పుడు కూడా కొత్తిమీర తినాలని సూచిస్తున్నారు. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

స్కిన్‌ని చాలా వరకు కాపాడుతుంది… చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం ఇలా ఏం జరిగినా, కొత్తిమీర కొన్ని రోజుల పాటు తింటే చర్మ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. కొత్తి మీర తింటే ఎండల వలన చర్మం పాడవుకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news