కరోనా మహమ్మారి వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మహమ్మారి వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. అయితే ఏది ఏమైనా ఇంకా మహామారి తగ్గిపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. రాత్రిపూట ఎక్కువగా బాడీ కి రెస్ట్ ఇవ్వడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అయితే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర అనేది మంచి హైట్ కి, బరువు కి కూడా అవసరమని అంటున్నారు నిపుణులు. మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల చాలా మంది తగినంతసేపు నిద్రపోవడం లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కారణంగా చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీని వల్ల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవాలి.
ఇప్పుడు రీసెర్చర్లు నిద్ర సరిగా లేకపోవడం వల్ల కరోనా సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు సరైన నిద్ర లేకపోవడం వల్ల కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయని… ఎందుకంటే నిద్ర కి ఇమ్యూనిటీ కి సంబంధం ఉందని అన్నారు. అంతే కాకుండా నిద్ర సరిగా లేని వాళ్ళలో కరోనా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఇటువంటి వాళ్లు ఒబేసిటీ, డయాబెటిస్, హైబీపీ, థైరాయిడ్ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మరింత కష్టం అవుతుందని అన్నారు. కనుక ప్రతి ఒక్కరు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యం. 5 గంటల పాటు నిద్ర పోవడం వల్ల అవసరమైనంత ఎనర్జీ వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి రోజు బాగా నిద్ర పోయేటట్టు చూసుకోండి లేదంటే ప్రమాదం అని తెలుసుకోండి.