ఆల్కహాల్‌ సానిటైజర్‌ దొరకడం లేదా? ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి

-

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చేతులు కడుక్కోవడానికి ఆల్కాహాల్‌ సానిటైజర్‌ అత్యుత్తమం.

కొవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కోవడానికి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మినహా మరో మార్గం లేదు. అలా ఉంచుకోవాలంటే చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో గానీ, సానిటైజర్‌తో గానీ ఎక్కువసార్లు కడుక్కోవాలి.

సాధారణంగా సానిటైజర్‌లు మార్కెట్లో బాగానే దొరుకుతాయి. అయితే ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్లు సరిగ్గా కనబడటంలేదు. ‘‘లైఫ్‌బాయ్‌ టోటల్‌ 10’’ అనేది ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్‌. కానీ ఇది చాలా చోట్ల ‘అవుటాఫ్‌ స్టాక్‌’ గా ఉంది. ఒకవేళ మీకు దొరికితే, వెంటనే ఓ ఐదారు తెచ్చుకోండి.

ఇక ఇటువంటి సానిటైజన్‌ లభించని వారు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దాని తయారీ విధానం ఈ కింద చూద్దాం.

1. ముందుగా మెడికల్‌ లేదా సర్జికల్‌ షాపుకెళ్లి ‘‘ఐసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌’’ తెచ్చుకోండి.
2. మీ ఇంట్లోని కలబంద (అలొవెరా) కాడను తుంచి, గుజ్జును తీసి పక్కన పెట్టండి.
3. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌ తీసుకుని మూడింట రెండు వంతులు ఐపిఏ పోయండి.
4. తర్వాత మూడింట ఒక వంతు కలబంద గుజ్జును వేయండి.
5. బాగా కలపండి.
6. సువాసన కోసం ఏదైనా సెంట్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలుపుకోండి ( మీకు అవసరమనిపిస్తేనే)
7. ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లోకి నింపుకుని, చేతులు కడిగినప్పుడల్లా రెండు మూడు చుక్కలు వేసుకుని బాగా రుద్దుకుని కడుక్కోండి.

ఇంతే. హోమ్‌మేడ్‌ సానిటైజర్‌ రెడీ. సిడిసి సూచనల ప్రకారం, ఈ సానిటైజర్లో 60 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. పైన చెప్పిన నిష్పత్తి ప్రకారం కలిపితే, అందులో ఆల్కహాల్‌ శాతం కొంచెం ఎక్కువగానే అంటే, 60,66 శాతం ఉంటుంది. కాబట్టి భాగాలు కరెక్ట్‌గా ఉండేట్టు చూసుకోండి.

అలాగే, ఎప్పుడు చేతులు కడిగినా, సబ్బు వాడినా, సానిటైజర్‌ వాడినా, మైక్రోబయాలజిస్ట్‌లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం, కనీసం 20 సెకన్లు బాగా రుద్దాలి. ఇది చాలా చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news