వెర్రి పుచ్చ మొక్క.. సర్వరోగ నివారిణి అని తెలుసా..?

-

మన జీవించే పద్ధతుల్లో మార్పులు వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న రోగాల కారణంగా చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఇక ఒక దానికి మెడిసిన్ వేసుకుంటే ఇంకో 4 వ్యాధులకు దారి తీస్తాయి. ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల గ్యాస్, మలబద్ధకం , ఊపిరితీత్తుల పని తీరు మందగిస్తుంది ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలా ఇంగ్లీష్ మందులు వాడకుండా సహజంగా వ్యాధులను తగ్గించుకోవడం ఎలానో తెలుసుకుందాం.. తోటల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్కలలో ఒకటి వెర్రి పుచ్చ మొక్క.File:Citrullus colocynthis 004.JPG - Wikimedia Commons

ఈ మొక్క ను సంస్కృతం లో ఇంద్రవారుని అని అంటారు.ఈ మొక్క వలన ఎన్నో లాభాలు ఉన్నాయని వైధ్యరంగం చెబుతుంది. ఈ వెర్రి పుచ్చ కాయ పెద్ద పుచ్చకాయ మాదిరిగానే ఉంటుంది కానీ నిమ్మకాయ అంత పరిమాణంలో ఉంటుంది . ఈ వెర్రి పుచ్చ మొక్క యొక్క మొత్తం భాగాలు రోగనివారణకు ఉపయోగపడతాయని అంటారు ఆయుర్వేద నిపుణులు.పూర్వం అమ్మమ్మలు జలుబు, దగ్గు వల్ల వచ్చే కఫాన్ని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలు కి,శరీరం పైనా వచ్చే గడ్డలు , చిన్న చిన్న కురుపులులకు దీని ఆకులను ఆముదం లో వేసి మరిగించి కొంచం గోరు వెచ్చగా ఉన్నప్పుడే గడ్డలు, కురుపులు లపైనా పెట్టడం లాంటివి చేసేవారట అవి తొందరగా తగ్గిపోయేవట.ఇవే లాభాలనే మన ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

సాధారణంగా పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని వల్ల పిల్లల్లో ఆకలి కాకుండాచేసి, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీనికి ఈవెర్రి పుచ్చ కాయ నుంచి వచ్చే రసాన్ని తీసుకోని స్టవ్ మీద కొద్దిగా వేడి చేసి దీనిని కడుపు మీద ఉంచడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోయి మలమూత్రాల ద్వారా బయటకి వస్తాయి. కొంత మంది ఆడవారికి తలలో పేను కొరుకుడు సమస్యఏర్పడి ఆ ప్రదేశం లో బట్టతల వచ్చినట్టు ఉంటుది. ఇలాంటి సమస్య కు ఈ వేర్లును తీసికొని దానికి సమానంగా బెల్లం కలిపి మెత్తగా చేసుకొని .. దానిని తలపై పెట్టి 20 నిమిషాలు తరువాత తలారా స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సమస్య తగ్గి పేను కొరికిన ప్రదేశంలో జుట్టు తిరిగి వస్తుంది. ఈ వెర్రి పుచ్చ ముక్కలను అప్పుడప్పుడు తినడం వల్ల విష పురుగులు కుట్టినప్పుడు వచ్చే సమస్యలు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news