ఆరోగ్యాన్ని పెంచే చద్దన్నం..!

-

అన్నం పర బ్రహ్మ స్వరూపం అని అన్నం అంటే సాక్షాత్తు దైవమే అని చెప్పారు మన పెద్దలు. అందుకే ఏ మాత్రం కొంచెం అన్నం మిగిలినా మర్నాడు తినేవారు కానీ అస్సలు పడేసేవారు కాదు. రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పెరుగుతో ఉదయాన్నే తినేవారు. కొందరు ఉల్లిపాయ, మరికొందరు పచ్చిమిర్చి, లేదంటే మామిడికాయ పచ్చడి నంజుకుని చాలా ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పటి తరానికి చద్దన్నం తినడం అంటే నామోషీ గా ఉంది. బియ్యం రేటు చుక్కలను అంటిన ఈ రోజుల్లో మిగిలిన అన్నాన్ని పడేస్తున్నారు కానీ తినడం లేదు. తినేవారి నీ చులకనభావంతో చూస్తున్నారు.

అయితే ఈ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు, పోషక విలువలు ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిన విషయం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. ఇంతకు ముందు తరం అంత అరోగ్యంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు అని నిపుణులు అంటున్నారు. చద్దన్నం లో ఉండే పోషకాలు తెలుసుకుందాం. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది.

అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలు చద్దన్నం తినడం వల్ల తగ్గుతాయి. ఉదయాన్నే చద్దన్నం తిన్నవారు రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version