పటికబెల్లం కచ్ఛితంగా ఎందుకు వాడాలి?

పటిక బెల్లం ఆరోగ్యకరమైనది. అందుకే ఆలయాల్లో సైతం ఈ పటిక బెల్లాన్ని వాడతారు. వైద్యులు కూడా పంచదారను విషంతో పోలుస్తానరు, అందువల్ల పంచదార బదులు తీపి కోసం పటిక బెల్లం లేదా నల్లబెల్లం వాడటం ఎంతో మేలు. ఈ రోజుల్లో మనం పటిక బెల్లం వాడటం మానేస్తున్నాం. టీలో వేసుకొని… దాన్ని కరిగించుకునేంత టైమ్‌ కూడా లేని బిజీ రోజులు ఇవి. కానీ పటిక బెల్లం వాడటం వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. పటిక బెల్లం వాడటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

 

చాలా మందికి శరీరంలో సరిపడా రక్తం ఉండదు. ఐరన్‌ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. అందుకో మనం తరచూ పటికబెల్లం వాడుతూ ఉంటే… రక్తంలో హిమోగ్లోబిన్‌ లెవల్‌ పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దానివల్ల రక్తహీనత, నీరసం, అలసట, తల తిరగడం వంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

  • దగ్గు, జలుబూ పెద్దవాళ్లను బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్య ఉంటే… నల్ల మిరియాల పడి, తేనె, పటికబెల్లం పొడిని బాగా కలిపి పేస్టులా చెయ్యండి. దాన్ని రాత్రివేళ తినండి. మంచి ఫలితం ఉంటుంది. ఉదయంవేళ నల్ల మిరియాల పొడి, పటికబెల్లం పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నా ఆరోగ్యం మెరుగవుతుంది.
  • నోటికి రుచికరంగా ఉండటమే కాదు… పటికబెల్లం మన బాడీని శక్తిమంతంగా చేస్తుంది. ఎంత పని చేసినా శక్తితో ఉండగలం.
  • కొంత మందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వారు పటిక బెల్లం తరచూ వాడాలి. ఈ సమస్యను పటికబెల్లం వెంటనే పరిష్కరిస్తుంది.
  • ఈ మధ్య అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. పటికబెల్లం జీర్ణవ్యవస్థను సరిగా చేస్తుంది. ఏం తిన్నా ఆ తర్వాత పటికబెల్లం తీసుకుంటే… చక్కగా అరిగిపోతాయి.

పటిక బెల్లం వల్ల మనకు తెలియని ఆరోగ్యాన్ని సక్రమంగా పెట్టే గుణాలు ఉన్నాయి. అందుకే మన డైలీ లైఫ్‌లో పటిక బెల్లానికి ఏదోవిధంగా ఒక భాగంగా చేసుకుందాం.