మనం నిద్రలేచిన తర్వాత మన ఎత్తు పెరుగుతుందనే విషయం మీకు తెలుసా..కారణం ఇదే.!

-

కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు అస్సలు నమ్మబుద్దికాదు..కానీ సైన్టిఫిక్ గా అవి నిజమని నిరూపించబడ్డాయి.. అలాంటి వాటిల్లో మన రెండు కాళ్లపాదాలలో ఒకటి పెద్దగా ఉంటుందని మీకు తెలుసా..ఈ విషయం మొదటిసారి తెలిసినవాళ్లు కచ్చితంగా కొలుచుకుంటారు. అలాగే మనం నిద్రలేచినప్పుడు మన ఎత్తు కూడా పెరుగుతుందట. ఏంటి నిజమేనా అనుకుంటున్నారా.. నిజమే. సాధారణంగా మనం అనుకుంటాం.. ఒక వయసు వచ్చే వరకే మనిషి ఎత్తుపెరుగుతాడు.. ఆ తర్వాత లావు అవ్వటం జరుగుతుంది కానీ ఎత్తు పెరగలేరు అని.

చిన్నప్పటి నుంచి ఆడే ఆటలని బట్టి, లేదా ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఒక మనిషి ఎత్తు పెరగటం బేస్ అయిఉంటుంది. బాస్కెట్ బాల్ కానీ, స్విమ్మింగ్ కానీ అలవాటు ఉన్నట్లయితే వారు ఎత్తుగా ఉంటారు అనే విషయం మనందరికి తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా టెన్నిస్, బాడ్మింటన్ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళు కూడా కొంచెం ఎత్తుగానే ఉంటారు అని అంటారు. దాంతో ఒక వయసు దాటిన తర్వాత ఆ మనిషి ఎత్తు మారదు. .

కానీ నిజం ఏంటంటే మనిషి ఎత్తు మారుతుంది. దీనికి వయసుతో ఏం సంబంధం లేదట. జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్ చెప్పినదాని ప్రకారం ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత తన సాధారణ ఎత్తు కంటే కొంచెం హైట్ గా ఉంటారట. ఇలా ఎత్తు పెరగడానికి తగ్గడానికి కారణం మన వెన్నెముక అలాగే ఇతర శరీర భాగాల మధ్య ఉండే గ్రావిటీ తగ్గడమే.

మనం పడుకున్నప్పుడు మన వెన్నెముక మధ్య ఉన్న కంప్రెషన్ తగ్గి కొంచెం పొడవుగా అవుతుందట. దాంతో మన ఎత్తు పెరుగుతుంది. ఆ పెరిగిన ఎత్తు మన మామూలు ఎత్తు కంటే దాదాపు ఒక అంగుళం ఎక్కువగానే ఉంటుందట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా.. కానీ ఇది సైంటిఫిక్ పరంగా కూడా నిజం అని తేలింది. కావాలంటే మీరు కూడా నిద్రలేచిన తర్వాత మీ ఎత్తుని కొలవండి. కచ్చితంగా ఒక అంగుళం ఎక్కువగానే ఉంటుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news