మాంసాహార ప్రియులకు బాగా ఇష్టమైన వాటిలో ముందు వరసలో ఉండేది చేపల కూర. చేపతో రకరకాలైన పులుసు,ఇగురు, ఫ్రై వంటి నోరూరించే వంటలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చేప తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12% తక్కువ ఉంటుంది అని పరిశోధనలో వెల్లడైంది.
ఆహారం లో భాగంగా తరచూ చేపను తినే వారికి పేగు క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుంది అని పరిశోధనలో తేలింది. ఆరోగ్యకర ఆహారం గా చేప ది పెద్ద పాత్ర అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలలో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపుని తగ్గిస్తాయి అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ పరిశోధకులు గుర్తించారు. శరీరం లోని వాపు ప్రక్రియ డీఎన్ఎ ను ధ్వంసం చేస్తుంది. దీంతో క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ , అంతర్జాతీయ ఏజెన్సీ For research if Cancer సంయుక్తంగా ఈ పరిశోధనలు చేశాయి.
అయితే కొన్ని రకాల చేపలకు మాత్రం దూరంగా ఉండండి అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. సాల్మన్, మాకరెల్ ఈ రెండు రకాల చేపలకు దూరంగా ఉండటం మంచిది అని వారు అంటున్నారు. ఈ రెండు రకాల చేపలలో నూనెలు అధికంగా ఉండటం వలన ఇవి అంత మంచిది కాదనిu సూచిస్తున్నారు. ఏదేమైప్పటికీ ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40% వరకు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.