Digital detox : స్మార్ట్ ఫోన్ ప్రపంచం నుండి బయటకు రావాలనుకుంటున్నారా..? ఇలా చేయండి.

-

చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తూ కళ్ళని డిజిటల్ స్క్రీన్ లకి అప్పజెప్పేస్తున్నారు. అవసరం లేకపోయినా మొబైల్ వాడకం పెరిగిపోయింది. ఈ కారణంగా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో, యువకుల్లో ఫోకస్ తగ్గిపోతుంది. సరిగ్గా ఆలోచించ లేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం అతిగా స్క్రీన్ చూసే అలవాటు నుండి నెమ్మది నెమ్మదిగా ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

లిమిట్ స్క్రీన్ టైం:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ టైమ్ ని లిమిట్ చేసే ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు పది నిమిషాలు ఫోన్ యూస్ చేయాలనుకుంటే.. సెట్టింగ్స్ లో స్క్రీన్ టైం 10 మినిట్స్ అని సెట్ చేసుకోండి. దానివల్ల 10 మినిట్స్ లో మీకు రిమైండర్ వస్తుంది. అప్పుడు ఫోన్ ని పక్కన పడేయవచ్చు.

ఫోన్ వాడకూడని ప్రదేశాలు:

తినే దగ్గర, పడుకునే గదిలో, నలుగురితో మాట్లాడుతున్నప్పుడు, అలానే మార్నింగ్ లేచిన వెంటనే, పడుకునే గంట ముందు ఫోను వాడకూడదని రూల్ పెట్టుకోండి. ఈ రూల్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయకూడదు. దీనివల్ల మీ మైండ్ మీద అనవసరమైన స్ట్రెస్ పడకుండా ఉంటుంది.

ఆఫ్ లైన్ హాబీస్ ట్రై చేయండి

ఎప్పుడూ ఫోన్ ని చేతిలో పట్టుకునే బదులు అప్పుడప్పుడు పూల కుండీలోని మొక్కలకు నీళ్లు పోయడం, ఇంట్లో వంట చేస్తుంటే కనీసం కూరగాయలు కట్ చేయడం వంటివి చేయాలి. ఈ పనుల వల్ల మీ మెదడు రిలాక్స్ అవుతుంది.

పని ఉంటేనే ఫోన్ వాడండి

మీరు మొబైల్ ఫోన్ ని వాడాలనుకుంటే.. అసలు దేనికోసం వాడాలనుకుంటున్నారో ముందుగా ఒక నిర్ణయానికి రండి. కేవలం ఆ పని కోసం మాత్రమే వాడి తర్వాత ఫోన్ ని పక్కన పెట్టేయండి.
దీనివల్ల మెదడు మీద నెగిటివ్ ప్రభావం పడకుండా హ్యాపీగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version