హైదరాబాద్ ను రోల్ మోడల్ గా మార్చాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇవాళ ISB లీడర్ షిప్ సమ్మిట్ జరిగింది. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ISB ప్రాంగణంలో ముఖ్యమంత్రి మొక్కను నాటారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ISB  విద్యార్థులు కొత్త ఇండియాకు అంబాసిడర్లు అని పేర్కొన్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్లకు మార్చడమే తమ లక్ష్యం అన్నారు. హైదరాబాద్ ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు.

హైదరాబాద్ దేశంలోని నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్ తో పోటీ పడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ప్రపంచంలోని ప్రతీ భాగానికి తీసుకెళ్లడంలో మీ సహాయం కావాలి అన్నారు. ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించే మాట్లాడండి అని కోరారు. హైదరాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని.. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version