ఛాయ్ లో బిస్కెట్స్ ని ముంచుకుని తింటున్నారా..? అది ఎంత ప్రమాదకరమంటే..?

-

చాలా మందికి సరదాగా సాయంత్రం పూట ఛాయ్ లో బిస్కెట్లు ముంచుకుని తినడం అలవాటు ఉంటుంది లేదంటే కాఫీలో కానీ బిస్కెట్లు ముంచుకుని తింటూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా..? అయితే దీనికి వల్ల కలిగే ప్రమాదం గురించి తప్పక తెలుసుకోండి. దీనిని కనుక మీరు చూశారంటే ఛాయ్ తో పాటు బిస్కెట్లను తీసుకోరు. ఆరోగ్య నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది.

 

టీ తో పాటు బిస్కెట్లుని ముంచుకుని తీసుకోవడం మంచిది కాదని…. దీని వల్ల ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని చెప్పారు. అయితే మరి దాని వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యమెందుకు దీనికోసమే పూర్తిగా చేద్దాం. మనం తీసుకునే బిస్కెట్ల లో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.

దీని వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. పైగా దానికి తోడు టీ లేదా కాఫీ లో ముంచుకుని తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలానే సోడియం లెవెల్స్ కూడా పెరిగిపోయే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనుక థైరాయిడ్ పేషెంట్లు డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు కచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి.

పైగా బిస్కెట్లను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. పైగా ఫైబర్ ఇందులో ఉండదని దీని వల్ల కాన్స్టిపేషన్ సమస్య కలిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలానే మైదా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. టూత్ క్యావిటీ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. షుగర్ లెవెల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతాయి కనుక మీరు ఇలా బిస్కెట్లను ఛాయ్ తో పాటు తీసుకున్నట్లయితే దానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే అనవసరంగా ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news