నిద్రలో పిల్లలు పళ్ళు కోరుకుతున్నారా…?

-

సాధారణంగా కొంతమంది నిద్రలో ఉండగా డే టైం లో చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అసలు పిల్లలు పళ్ళు కొరకడం వెనుక కారణాలు తెలుసుకుందాం.

సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు. పళ్ళ వరుస ఎగుడు దిగుడు గా ఉండటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు నొప్పికి స్పందించడానికి పిల్లలు పళ్ళు కొరుకుతారు. కొన్ని రకాల వ్యాధులకు వాడే ఔషధాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. నిద్రలో మాట్లాడే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల పళ్ళ పై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఇంకా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అయితే ఈ సమస్యని దూరం చేయడానికి తల్లి తండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఓ సారి ఈ చిట్కాలను చూడండి.

పిల్లలకి వెచ్చటి స్నానం, చక్కని సంగీతం వినిపించడం మరియు పుస్తకాలు చదవడం వంటి స్లీపింగ్ చిట్కాలను అలవాటు చేయాలి. అధిక కెఫిన్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ కి దూరంగా ఉంచాలి. ఇంకా చూయింగ్ గంమ్ నమలడం వల్ల పిల్లల దవడలు అధికంగా బిగించి ఉండటం వల్ల కూడా నిద్రలో పళ్ళు కొరకవచ్చు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి వారితో మాట్లాడటం మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. దీని ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడం వల్ల పళ్ళు కొరికే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news