నొప్పి ఉపశమనానికి చెయ్యండిలా..!

-

మీకు గుర్తుకు ఉండే ఉంటది.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా నొప్పిగా ఉందంటే చాలు కాపడం పెట్టేస్తుంటారు. అప్పుడా నొప్పి నుంచి కొంత మేర ఉపశమనం లభించేది. కంట్లో నలక పడినప్పుడు దాన్ని ఊదేస్తుంటారు. నలక తొలగిపోయాక కూడా కన్ను మంటగా ఉంటది. అప్పుడు పెద్దవాళ్లు టవల్ తీసుకుని నోటి వేడి గాలితో ఊది కంటికి అద్దుతుంటారు. ఇలా ప్రతి సందర్భంగా నొప్పి, మంట అనిపించినప్పుడు ఏదో ఒక చిట్కాతో ఉపశమనాన్ని పొందేవారు. కాలం మారింది.. ఫ్రిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నొప్పి అనిపించే ప్రదేశాల్లో ఐస్ గడ్డలు పెట్టి ఉపశమనం పొందే వాళ్లను చూస్తూనే ఉంటాం. నొప్పి తీవ్రతను బట్టి వేడి కాపడం పెట్టడం, లేదా చల్లటి కాపడం పెట్టడం ప్రథమ చికిత్సగా మారింది. అయితే ఏఏ సందర్భాల్లో కాపడం పెట్టాలి, ఎలా వాడాలో తెలుసుకుందాం.

hot pack
hot pack

చల్లటి కాపడం (ఐస్ ప్యాక్)..
ఐస్ ప్యాక్ అనేది తాజా గాయాలకు వర్తిస్తుంది. కొన్ని సార్లు గాయం తగిలిన చోట ఐస్ తో అద్దడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తాజా గాయాలపై ఐస్ అద్దడం వల్ల ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. మూగ దెబ్బలు (గాయం శరీరం లోపల తగిలి.. బయట వాపు, చర్మం ఎరుపెక్కడం) తగిలినప్పుడు వాపు వచ్చిన ప్రదేశంలో కాస్త వేడి, మంట అనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల చర్మం చల్లబడి కాస్త ఉపశమనం అందుతుంది. ఐస్ పెట్టడం వల్ల దెబ్బ తగిలిన చోట రక్తనాళాలు సంకోచిస్తాయి. అక్కడ ఐస్ పెట్టడం వల్ల వాపు తొందరగా తగ్గడానికి ప్రేరేపిస్తుంది. రక్తనాళాల వ్యాకోచం, రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్ కెఫలిన్స్ అనే ఉత్ర్పేరకాలు విడుదలై నొప్పిని తగ్గిస్తాయి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ కాపడం పెట్టాలి.

వేడి కాపడం (హాట్ ప్యాక్)..
నొప్పి ఒక చోటు నుంచి వేరే చోటుకు ప్రయాణించేటప్పుడు వేడి కాపడం పెట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. మహిళల నెలసరి సమయాల్లో నడుము వద్ద నొప్పి వస్తున్నప్పుడు వేడికాపడంతో కొంతమేర ఉపశమనం కలుగుతుంది. వేడి వల్ల శరీర కండరాల్లో రక్తప్రసరణ జరిగి నొప్పి తగ్గుతుంది. దెబ్బ తగిలిన చోట మలినాలు నశించి.. కండరాలు రిలాక్స్ అవుతాయి. పిండి లేదా ఉప్పును వేడి చేసి బట్టలో తీసుకుని నొప్పి ఉన్న చోట 10-15 నిమిషాలు ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news