జామ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

-

సాధారణంగా అన్ని కాలాలోను అన్ని వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఉండే అతి మధురమైన, ఎక్కువ పోషకాలు ఉన్న పండు జామ కాయ. ఇది తినడానికే కాదు చాల రకాల వ్యాదులకు చికిత్సగాను ఉపయోగపడుతుంది. ఆరు కమలా పండ్లుగాని, రెండు ఆపిల్ పండు కాని తింటే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క జామ కాయలో అన్ని పోషకాలు ఉంటాయి.

100గ్రాముల జామ 66 క్యాలరీ ల శక్తిని ఇవ్వగలదు.100గ్రాముల జామలో కార్భో హైడ్రేట్స్, ప్రోటిన్స్,కాల్షియం, ఐరన్, సోడియం మొదలైన విటమిన్లు ఉంటాయి. ఇది అరగడానికి 3 గంటలు టైం పడుతుంది.జామ పండ్లు 15రకాలు ఉన్నాయి.ఇకపోతే ఈ జామ కాయే కాదు వీటి ఆకులు, బెరడు కూడా వైద్యానికి ఉపయోగపడుతుంది.

దంతముల చిగుర్ల నుండి రక్తం కారు వారు జామకాయని కొరికి బాగా నమిలి చప్పరించి ఊసివేస్తే రక్తం కారడం ఆగి పోతుంది.దంతములకు ఎనలేని మేలు చేకూరుతుంది. టిబి,గుండె బలహీనంగా ఉన్నవారు కామెర్లు,ఆడవాళ్ళలో వచ్చే బహిస్టు నొప్పులకు జామ గుజ్జులో తేనే, పాలు కలిపి సేవిస్తే ఈ వ్యాదులన్ని త్వరగా నయమౌతాయి. లేత జామ ఆకులను కొద్దిగా ఉప్పు కలిపి ఉదయము,సాయంత్రము నమిలితే నోటి పూత, గొంతు నొప్పి,నోటిలో పుళ్ళు ఒక వారం లో తగ్గుతాయి.

ముఖం మీద మొటిమలకు లేత జామ ఆకులు నూరి రాస్తుంటే అవి తగ్గిపోతాయి.బాగా పండిన జామపండులో 5గ్రాములు జామ బెరడు పొడి కలిపి సేవిస్తే తరచుగా జలుబు చేయదు. గజ్జికి లేత జామ ఆకులు నూరి అందులో పసుపు కలిపి రాస్తే గజ్జి దూరమౌతుంది.జామ చెట్టు వేరుని పొడి కొట్టి రోజుకు రెండు, మూడు సార్లు సేవిస్తే జీర్ణ శక్తీ వృద్ది చెందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version