గర్భస్రావం తరువాత అశ్రద్ధ వద్దు!.. తొందరపడి మళ్లీ ఆ పని చేయొద్దు

-

ఒక స్త్రీకి గర్భందాల్చటం, తల్లి అవటం అనేది పునర్జన్మలాంటిదే. ఏంతో ప్రత్యేకంగా భావిస్తారు. వారి సంతోషానికి అవథులు ఉండవు. కానీ కొన్నికారణాల వల్ల గర్భం దాల్చిన ప్రతిసారి అది సజావుగా జరగదు. గర్భస్రావం కూడా అవుతుంది. అయితే అది ఆరోగ్యపరంగానూ అవ్వొచ్చు, మీకు మీరే కావలని చేసుకోని ఉండొచ్చు. ఇప్పుడు ఇది అందరికి కామన్ అయిపోయింది. ప్రతి ఆరుగురిలో ఒకరికి గర్భస్రావం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

గర్భస్రావం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

కొందరు మహిళలు గర్భస్రావమే కదా అన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల్లోనే తమరోజువారి పనులు చేయడం ప్రారంభిస్తారు. అయితే అలా చేయటం ఏమంత మంచిదికాదు. సౌకర్యంగా అనిపించేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలి.

గర్భస్రావం సందర్భంలో నొప్పితోపాటు, నెలసరిలో వచ్చినట్లుగానే రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఏమాత్రం ఇబ్బంది తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందటం మంచిది.

ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల దృష్యా గర్భస్రావం అయితే.. మానసికంగా కుంగిపోతారు, ఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇది ఏమాత్రం మంచిదికాదు. పదేపదే అదే ఆలోచనతో నిద్రపట్టకపోవటం, ఆకలి లేకపోవటం, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతుంటే మానసిక వైద్యునిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవటం ఉత్తమం.

గర్భస్రావం అయిన వెంటనే గర్భం దాల్చేందకు ప్రయత్నించటం అసలు మంచిపద్ధతి కాదు. పూర్తి స్ధాయిలో ఆరోగ్య పరంగా కోలుకున్నాకే ఆ ఆలోచన చేయటం మంచిది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావాలు అయినప్పుడు గర్భం దాల్చేముందు, డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. . గర్భాశయం పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు.

గర్భస్రావం తరువాత ఆరోగ్యపరమైన జీవన విధానంపై దృష్టి సారించాలి. సాధ్యమైనంత వరకూ అన్నిరకాల పోషకాలు లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

మహిళలకు గర్భస్రావం నుంచి బయటపడటానికి చాలా టైం పడుతుంది. ఈ సమయంలో వారికి మంచి ధైర్యాన్ని కుటుంబసభ్యులే ఇవ్వాలి. అసలే బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నవారికి..తప్పు వాళ్లదే అనే రీతిలో కొందరు బ్లేమ్ చేస్తుంటారు. అలా అసలు చేయకూడదు. తద్వారా వాళ్లు ఇంకా కుంగిపోతారు. ఏం కాలేదు అనే ధైర్యాన్ని భర్తే ఇవ్వాలి. తన భార్య ఆరోగ్యంపై పూర్తి రక్షణ బాధ్యత ఆ సమయంలో భర్త కంటే..ఎ‌వరు తీసుకన్నా మహిళలు అంత ధైర్యంగా ఫీల్ అవ్వలేరు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news