సమ్మర్ సోగ్గాళ్లుగా వెంకటేశ్, వరుణ్ తేజ్ వచ్చేస్తున్నారహో..F3 అప్‌డేట్ ఇదే..

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం F3. F2కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా కౌర్ నటించారు. ఈ పిక్చర్ నుంచి ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.

ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల 9న చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్‌ చౌహాన్‌ కీలకపాత్రల్లో ఈ మూవీలో కనిపించనున్నారు. సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా డెఫినెట్ గా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలోనూ వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపు ఉంటుందని ఇప్పటికే విడుదలైన పాటల ద్వారా స్పష్టమవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక ఇందులో స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతున్నది. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ‘ఎఫ్-3’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్ ఇచ్చినట్లు టాక్. మొత్తంగా సమ్మర్ లో వినోదాన్ని పంచే సోగ్గాళ్లుగా విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వస్తున్నారు. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news