బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల ప్రయోజనాలను మనం బాదంతో పొందొచ్చు. ఆకుపచ్చ బాదం ని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆకుపచ్చ బాదం ని తీసుకునేటప్పుడు పచ్చి వాటిని అసలు తీసుకోవద్దు.
పచ్చి బాదాం ని తీసుకోవడం వల్ల కిడ్నీ, లివర్ మరియు ఇతర సమస్యలు కలుగుతాయని రీసెర్చర్లు చెప్పడం జరిగింది. అయితే పచ్చి బాదంని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొంటారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.
లివర్ సమస్యలు:
ఆకుపచ్చ బాదం ని తీసుకోవడం వల్ల లివర్ డామేజ్ అవుతుంది. అలానే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాన్స్టిపేషన్, బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
మైగ్రేన్ సమస్య:
ఒకవేళ కనుక మైగ్రేన్ తో బాధపడే పేషెంట్లు పచ్చి బాదం ని తీసుకుంటే బాడీలో కెమికల్ యాక్షన్స్ పెరిగిపోతాయి. దీంతో మైగ్రేన్ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి పచ్చి బాదం ని అసలు తీసుకోవద్దు.
కిడ్నీ సమస్యలు:
పచ్చి బాదం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు వస్తాయి. దీంతో కిడ్నీలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
పోషక విలువలు తగ్గిపోతాయి:
పోషక విలువలు సరిగ్గా ఉండకుండా ఇది చేస్తుంది. ఇలా పచ్చి బాదం ని తీసుకోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.