ఎనర్జిటిక్ రామ్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్20 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా అధికారిక ప్రకటన కూడా చేశారు. కాగ ఈ సినిమాను పాన్ ఇండియా రెంజ్ లో తెర కెక్కించాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రణాళికలను సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది.
అందుకు అనుగూణంగా సినిమాలో పాన్ ఇండియా రెంజ్ లోనే నటీ నటులను చిత్ర బృందం ఎంపిక చేస్తోంది. కాగ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ లలో ఒక్కరు అయిన పరిణితీ చోప్రా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక అయినట్టు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ బోయపాటి శ్రీను పరిణితీ చోప్రా తో కథ విషయంలో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై పరిణితీ చోప్రా కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అలాగే బాలీవుడ్ నుంచే మరో ఇద్దరు నటులను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.