తల , కళ్ళల్లో విపరీతమైన నొప్పి కలుగుతోందా.. అయితే ఇలా చేయండి..!

ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి కారణంగా తరచూ తలనొప్పికి గురి అవుతూ ఉంటారు. మరికొంతమందికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి తలనొప్పితో పాటు కళ్ళల్లో నొప్పి, కళ్ళ వెంట నీరు కారడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇలా తరచూ తల అలాగే కళ్ళల్లో నొప్పికి కారణం రోజంతా ఒత్తిడి అయితే మైగ్రేన్, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, కంటినొప్పిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

ఆయిల్ మసాజ్ చేయడం .. తల నొప్పి, కళ్ళల్లో నొప్పి కలిగితే మసాజ్ చేయడం వల్ల వెంటనే రిలాక్స్ కలుగుతుంది. నిజానికి చాలా సంవత్సరాలుగా తలనొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా ఆయిల్ మసాజ్ తో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. మసాజ్ చేసిన తర్వాత కొద్దిసేపు తలను నొక్కడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఇక తగినంత నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత కళ్ళు నొప్పిగా, మంటగా కనిపిస్తాయి. అంతేకాదు ఎక్కువసేపు లాప్టాప్ , మొబైల్ వంటివి చూసిన కూడా తలనొప్పి, కళ్ళ సమస్యల ప్రారంభం అవుతాయి. కాబట్టి మీరు తగినంత గాఢ నిద్ర పొందడం అవసరం . ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సాధ్యమైనంత వరకు మొబైల్ ను తక్కువగా మాత్రమే చూడాలి. ప్రతిరోజు 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి.. ఇలా చేస్తే కచ్చితంగా తలనొప్పి తగ్గిపోతుంది.

మంచి ఆహారంతో పాటు జీవనశైలి పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వాటిని చేర్చుకుంటే తలనొప్పి , కళ్ళ నొప్పులు వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా వెల్లుల్లి నిమ్మ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

ఇక మనసును ఒత్తిడి లేకుండా చేయడానికి, తలనొప్పిని దూరం చేయడానికి తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల ధ్యానం చేయడం వల్ల తలనొప్పి కంటినొప్పి కూడా దూరం అవుతాయి.