ఉదయం లేచి బాల్కనీలో కుర్చోని.. కాఫీ తాగుతుంటే.. ఆ మజానే వేరు. డే ఫ్రెష్‌గా స్టాట్ అవుతుంది. చాలా మందికి కాఫీ అంటే.. ప్రాణం. కాఫీ ఒక్కరోజు లేకపోతే ఆగం ఆగం అవుతారు. కొందరైతే.. రోజుకు నాలుగు ఐదులు కప్పులు తాగుతుంటారు. కాఫీ మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేస్తుంది. కాఫీలో కొబ్బరి నూనెను వేసుకోని తాగడం గురించి మీరు విన్నారా..? దీన్ని బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. కాఫీలో కొబ్బరినూనె ఏంట్రా అని మీకు ఆశ్యర్యంగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయండీ. మీ కాఫీని మరింత హెల్తీగా చేయాలంటే.. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.!
ప్రతిరోజు ఉదయం పూట ఒక కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కాఫీ కొబ్బరి నూనె మిక్స్ చేసుకొని తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతోపాటు బ్యాక్టీరియా కూడా సులభంగా నశిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో కొబ్బరినూనె మిక్స్ చేసుకొని తాగడం వల్ల మెదడు కూడా సులభంగా మెరుగుపడుతుంది. దీని కారణంగా ఏకాగ్రత పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడులోని నరాలను దృఢంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు కాఫీ కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య పూర్తిగా నయం అవుతుంది.
ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్తో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా డిప్రెషన్‌ను తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి.