కాంగ్రెస్ హామీలను కేసీఆర్ కాపీ కొట్టారు : రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ కాపీ కొట్టి.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకటించగానే కేసీఆర్ వెంటనే కొంత మంది అభ్యర్థులకు భీ ఫామ్స్ అందజేశారు. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 51 మందికే బీ ఫామ్స్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లు చూడగానే కేసీఆర్ కి చలిజ్వరం వచ్చిందన్నారు.

 సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రెండు ఛాలెంజ్ లు విసిరారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బీఆర్ఎస్ చుక్కా మద్యం పంచదని, డబ్బులు వెదజల్లదని ప్రమాణం చేయగలదా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తే అక్టోబర్ 17న తాను అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని, కేసీఆర్ కూడా వచ్చి అమరుల సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1నే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు వేయగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇండియా కూటమి లో చేరుతామంటే గేటు కూడా తాకనివ్వలేదని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news