మనకి సాధారణంగా జిల్లేడు ఆకు దొరుకుతూనే ఉంటుంది. తుప్పల్లో ఎక్కువగా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. జిల్లేడు పూలను, జిల్లేడు ఆకులను పూజకు ఉపయోగిస్తుంటాము. అయితే జిల్లేడు లో రకాలు కూడా ఉన్నాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి. తెల్ల పూల జిల్లేడు ఒకటి. అయితే చాలా మంది దీనిలో విషం ఉంటుందని దూరంగా ఉంటారు.
కానీ నిజానికి జిల్లేడుని ఆయుర్వేదంలో ఒక కూడా ఉపయోగిస్తూ ఉంటారు. జిల్లేడు వల్ల చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే మరి జిల్లేడు వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయి..? ఏ విధంగా జిల్లేడు మనకు సహాయం చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి జిల్లేడు బాగా ఉపయోగపడుతుంది. నిజానికి ఈ మధ్య కాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. అటువంటి వాళ్ళకి జిల్లేడు బాగా సహాయం చేస్తుంది.
కలబంద గుజ్జు తీసుకుని దానిలో ఒక చెంచా పసుపు కలిపి మెత్తని మిశ్రమంగా చేయాలి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు ఆకు తీసుకుని దానికి నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. కీళ్ల నొప్పులు ఉన్న చోట ముందు కలబంద గుజ్జు పసుపు మిశ్రమాన్ని పెట్టి దాని మీద వేడిచేసిన జిల్లేడు ఆకులు వేసి గట్టిగా కట్టాలి. ఇలా రాత్రి పూట మీరు కట్టుకుని ఉదయాన్నే తీసేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కేవలం కీళ్ళ నొప్పులకు మాత్రమే కాదు మధుమేహంతో బాధపడే వాళ్లకు కూడా జిల్లేడు ఆకులు బాగా ఉపయోగపడతాయి.
మధుమేహంతో బాధపడే వాళ్లు రాత్రి నిద్రపోయే ముందు జిల్లేడు ఆకులను శుభ్రంగా కడిగి అరికాళ్ళ కి కట్టుకోవాలి. ఊడిపోకుండా కట్టుకున్న సరే లేదంటే సాక్సులు వేసుకున్న సరే. ఇలా చేయడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ ఆకులు పొడి పుండ్లు గాయాలపై రాస్తే కూడా తగ్గుతుంది. ఇలా జిల్లేడు వల్ల ఎన్ని లాభాలు మనం పొందవచ్చు ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి అవుతుంది.