ట్రెండ్ ఇన్: మార్యాద పురుషోత్తముడు ‘ఆదిపురుష్’..శ్రీరామ నవమి కానుక కోసం ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులు

-

మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముడి పాత్రను వెండితెరపైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో పోషిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారన్న వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మేకర్స్ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు #Adipurush హ్యాష్ ట్యాగ్ ఆదిపురుష్‌ ను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తు్న్నారు. #RamNavami రామ నవమి హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడిస్తూ శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. దాంతో #Adipurush ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ పిక్చర్ లో రాముడు ప్రభాస్ కాగా, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఆదర్శప్రాయమైన రాముడి జీవితాన్ని వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు ఓం రౌత్. శ్రీరామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ మేకర్స్ నుంచి ఎటువంటి అప్ డేట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ, అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, గత చిత్రాల్లోని ప్రభాస్ లుక్స్, రాముడి అవతారంలో ప్రభాస్ పెయింటింగ్స్ షేర్ చేసి, ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ను ఇంకా ట్రెండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news