మన భారత దేశం లో ఏ పని ప్రారంభించిన నోరు తీపి చేసు కుంటారు. ఎందుకంటే ఆ పని కూడా ఏ ఆటంకాలు లేకుండా సకల శుభాలు కలిగించే విధంగా ఉండాలని ఆశిస్తూ బెల్లం తో నోరు తీపి చేసుకుంటారు. బెల్లం వాడకం అనేది భారతీయుల జీవన విధానం లో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్ళు, ఆరోగ్యం, నైవేద్యాలు,పెళ్లిళ్లు, పేరంటాలు మొత్తం అన్ని చోట్లా బెల్లానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పలేము.
మన దేశంలో రెండు అతి పెద్ద బెల్లం మార్కెట్లు ఉన్నాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్ లోముజఫర్ పూర్ కాగా రెండోది ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లో ఉన్నాయి. పంచదార కన్నా బెల్లం ఎంతో మేలు చేస్తుంది. మిలమిల మెరిసే బెల్లం అధిక తీపి రావడం కోసం రసాయనాలు కలుపుతారు.పసుపు రంగులో ఉన్న బెల్లం చెరకు గడలు నుండి రసాన్ని సేకరించి స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తారు.ఈ విధమైన బెల్లంలో విటమిన్లు,ఖనిజాలు కూడా ఉంటాయి.
రసాయనాలు వాడకుండా తయారయ్యే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం.బెల్లం వాడకం షుగర్ వ్యాధి గ్రస్తులు కు ఎంతో మంచిది. రక్త హీనత ను తగ్గిస్తుంది.అధిక బరువును నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థకు బలం, మహిళలకు రుతు క్రమం లో వచ్చే చికాకులు, కడుపు నొప్పి బెల్లం తో దూరమవుతాయి. ఆయుర్వేదం లో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్,ఆస్తమా,పార్శ్వపు నొప్పి మొదలైనవాటిని తయారయ్యే ఔషధాల్లో బెల్లాన్ని వాడతారు.
ఒక టీ స్పూన్ పంచదార లో 60 క్యాలరీ లు వస్థే అంతే టీ స్పూన్ బెల్లం తో 27 క్యాలరీ లు వస్తాయి. అందుకే పంచదార కన్నా బెల్లమే అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అధికంగా పంచదార వాడితే గుండె జబ్బులూ, ఉబకాయం వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా హెచ్చరిస్తుంది.పిల్లల్లో పెరుగుదలకు దోహద పడుతుంది. నిత్యం బెల్లం వాడినవారికి త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు.