తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని నడిపించడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కి దిమ్మతిరిగిపోయే షాక్ కి గురైన చంద్రబాబు తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చెలరేగిపోతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం జరిగింది. ఎలాగైనా వైయస్ జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని భావించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు అనేకమార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని బాబు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందో…రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కాస్తంత లేచింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్దిగా పార్టీ బలపడే అవకాశాలు ఉన్నట్లు అనేక సర్వేలలో తేలింది.అయితే ఇటువంటి తరుణంలో బీసీల రిజర్వేషన్ అంశంలో వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతాపరెడ్డి చేత సుప్రీంకోర్టులో వేయించిన పిటిషన్ బాగోతం మొత్తం బయటపడటంతో సెల్ఫ్ గోల్ తో చంద్రబాబు మొత్తం పోగొట్టుకున్నట్లు అయ్యింది.
ప్రతాప రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అని మరియు చంద్రబాబుతో నారా లోకేష్ తో దిగిన ఫోటోలు కూడా బయటకు రావడంతో బాబు పరువు మొత్తం పోయింది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ డ్రామా మొత్తం బయటపడటంతో ప్రస్తుతం చంద్రబాబు ప్రచారంలో మరియు ఆయన మాటల్లో అడుగడుగునా బేలతనం కనిపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.