పిల్లల్లో ఊబకాయం ఉంటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు తెలుసా..?

మంచి లైఫ్ స్టైల్ ను పాటించకపోవడం వల్ల బరువు పెరిగిపోవడం మరియు ఊబకాయం పెద్ద సమస్యలుగా మారాయి. అయితే ఈ మధ్యకాలంలో ఊబకాయం చిన్నపిల్లలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అతిగా తినడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం మరియు జెనిటిక్స్ వల్ల చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్య వస్తుంది. ఊబకాయం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

 

children

హై బీపీ మరియు హై కొలెస్ట్రాల్ :

శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. దానితో హైబీపీ సమస్య వస్తుంది. అదే కొనసాగితే కార్డియోవాస్క్యులర్ కు సంబంధించిన జబ్బులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ వంటివి కూడా వస్తాయి.

టైప్ 2 డయాబెటిస్:

ఎప్పుడైతే చిన్న పిల్లలు బరువు పెరిగిపోతారో వారిలో ఇమ్పెయిర్డ్ గ్లూకోస్ ఇంటోల్రన్సు సమస్య వస్తుంది. దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. దానితో పాటుగా పిల్లల లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది.

శ్వాస సమస్యలు:

బరువు పెరిగిపోవడం వల్ల చిన్న పిల్లల్లో ఆస్తమా వంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. దానివల్ల శారీరిక వ్యాయామాలు కూడా చేయడానికి కష్టమవుతుంది. దాంతో వారి ఆరోగ్యం పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

జాయింట్ పెయిన్స్:

అధిక బరువు వల్ల జాయింట్స్ పై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. దానివల్ల కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఎలా అయినా ఇది చాలా ప్రమాదమే అని చెప్పాలి.

మానసిక సమస్యలు:

అధిక బరువు ఉండటం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. దాంతో కోపం, చిరాకు, ఆందోళన మరియు డిప్రెషన్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా ఇతరులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.