కరోనా కొత్త వేరియంట్ పై ప్రపంచ దేశాలు అలెర్ట్… ఆ దేశాల వాళ్లకు ‘నో‘ ఎంట్రీ

-

ప్రపంచాన్ని మళ్లీ కరోనా భూతం భయపెడుతోంది. తాజాగా కొత్త వేరియంట్ రూపంలో విరుచుకునే పడేలా కనిపిస్తోంది. కొత్త వేరియంట్ B.1.1.529 దక్షిణాఫ్రికాలో బయటపడింది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందుతుండటతో పాటు యువకులకు ఎక్కువగా సోకే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఇండియా కూడా వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అలెర్ట్ గా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. కాగా ఇప్పటి వరకు కొత్త వేరియంట్ B.1.1.529  కేసులేవీ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.

corona

ఇదిలా ఉంటే కొత్త వేరియంట్ భయాలు పలు దేశాలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న యూరప్ దేశాలు.. కొత్త వేరియంట్ ముప్పు ఉన్న దేశాల నుంచి ప్రయాణాలను బ్యాన్ చేస్తున్నారు. తాజా యూకే..రేపు మధ్యాహ్నం నుండి ఆరు ఆఫ్రికన్ దేశాలు నుంచి విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాత్ దేశాల నుంచి రాకపోకలను నిషేధించారు. మరోవైపు ఇటలీ, జర్మనీ దేశాలు కూడా సౌతాఫ్రికా నుంచి ప్రయాణాలను నిషేధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news