ఆవాల నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా అవుతుంది. ఆవాల నూనె లో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఒమేగా త్రీ, లెనో లినిక్ యాసిడ్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. అయితే ఇందులో వుండే పోషక పదార్ధాలు మనకి చాలా ఉపయోగకరం. నిజంగా చాలా ముఖ్యం కనుక రెగ్యులర్ గా దీనిని తీసుకుంటూ వుండండి. అయితే ఆవాల నూనె వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడు చూద్దాం.
ఆవాలు నెలలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది.
బీపీని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలు తగ్గిస్తుంది.
దగ్గు, జలుబు లేదా అలర్జీ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆవాల నూనె లో యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది.
క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షిస్తుంది.
రెడ్ బ్లడ్ సెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది.
ఆవాల నూనెను ఎలా ఉపయోగించాలి..?
ఆవాల నూనెతో పిల్లలకి మసాజ్ చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి.
గమ్స్ ని ఆవాల నూనెతో మసాజ్ చేస్తే పంటి సమస్యలు ఉండవు.
జుట్టుని ఆవాల నూనెతో మసాజ్ చేస్తే త్వరగా ఎదుగుతుంది.
చుండ్రు సమస్య నుండి కూడా ఇది బయటపడేస్తుంది.
చర్మంపై ఆవాల నూనెతో మసాజ్ చేస్తే ట్యాన్ సమస్య తొలగిపోతుంది.