బరువు తగ్గుతున్నా.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదా..?

-

చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. కానీ.. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా వాళ్ల పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం తగ్గదు. అరె.. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఎందుకు పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంట. ఒకవేళ మీ ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు అస్సలు కరగదు. శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంటే.. క్రమం తప్పకుండడా మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆకు కూరలు, బీన్స్, నట్స్ తీసుకోవాలి.

Fat woman cartoon style different stages vector illustration. Fat problems. Health problems. Fast food, strong sport and fat people. Obesity process people illustration

సోడియాన్ని అతిగా తీసుకునే వాళ్లకు బరువు తగ్గడం కోసం ఎన్ని ఫిట్ నెస్ వ్యాయామాలు చేసినా పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది.

కొంతమంది సరిపోయేంత నిద్ర పోరు. దీని వల్ల మానసికంగా కాసింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అది బరువుపై ప్రభావం చూపిస్తుంది. అంటే కనీసం ఆరేడు గంటలు కూడా నిద్రపోని వాళ్లు ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గరు. పొట్ట దగ్గరి కొవ్వు అయితే అస్సలు కరగదు.

చాలామంది పురుషులు ఇష్టంగా తాగే బీరు కూడా పొట్టలో కొవ్వును పెరిగేలా చేస్తుందట. బీరును అతిగా తాగితే.. పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా పెరిగిపోతుందట.

బరువు తగ్గడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అస్సలు తగ్గదు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news