సోడా తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా..?

-

కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, ఫుడ్ డైజెస్ట్ కావడానికి సోడా తాగేయడం అందరికీ అలవాటే. ప్రజలు జంక్ ఫుడ్ కు అలవాటు పడినప్పటి నుంచి సోడా తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. రెస్టారెంట్లలో మసాలా ఫుడ్స్, బిర్యానీలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సోడా కూడా ప్రీఫర్ చేస్తుంటారు. ఆహారం జీర్ణించుకోలేనప్పుడు చిన్నపిల్లలకు కూడా సోడా తాగడం అలవాటు చేస్తున్నారు. అయితే మోతాదుకు మించి సోడాను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. సోడా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం రండి.

color soda
color soda

సోడాలో ఎక్కువ మోతాదులో చక్కెర స్థాయి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక గ్లాసుకు మించి సోడాను తాగే వారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారు సోడాను తాగితే వారి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. దీనిపై జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనం కూడా జరిపింది. ఈ అధ్యయనంలో సోడా పరిమితికి మించి సేవించడం ప్రాణాంతకమేనని తెలుపుతున్నారు.

నార్మల్ సోడా కంటే చక్కెర కలిపిన సోడాలు మూడు రెట్లు ప్రమాదకరమని ఈ అధ్యాయనంలో తేలింది. కానీ రెస్టారెంట్లలో తినేటప్పుడు చాలా మంది చక్కెరతో తయారు చేసిన సోడాలనే తాగుతుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులుగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.

ఆహారం, సోడాలో వాడే రంగుల వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పవచ్చు. ఈ ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడటం వల్ల వీటి ప్రభావం డీఎన్ఏలపై చూపుతుందని, తద్వారా క్యాన్సర్ కి దారితీసే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొంత మంది ప్లాస్టిక్ బాటిల్స్ లో దొరికే సోడా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భావించి అల్యూమినియం టిన్ లో దొరికే సోడాలను ప్రీఫర్ చేస్తున్నారు. వీటిని అధికంగా తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీలైనంత వరకు సోడాల వాడకాన్ని తగ్గస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news