డీ హైడ్రేషన్ : మన శరీరంలో నీటిశాతం 20 శాతానికి తగ్గితే ముప్పే..

మానవులు ఏమి తినకుండా 8 వారాల పాటు బతుకగలరు. కానీ అన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వేళకు నీళ్లు మాత్రం తాగాలి. దీన్ని బట్టి మానవాళి ప్రాణధారం నీరు ఆవశ్యకత అర్థం చేసుకోవచ్చు. మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే డీ హైడ్రేషన్ Dehydration స‌మస్య వ‌స్తుంది. జీవనాధారమైన నీరు మానవుడి శరీరంలోని ఇతర అవయవాల పనితీరును మెరుగుపరచడంతో పాటు న్యూట్రిషన్స్‌ను సరఫరా చేస్తుంది. మన శరీరంలో నీటి కొరతను బట్టి మన ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితులలోకి నెట్టివేయబడుతుంది. మనం తాగే నీరు కంటే ఎక్కువ స్థాయిలో శరీరం నుంచి నీరు బయటకు వెళ్తే ఇక ప్రమాదం పొంచి ఉన్నట్టేనని గుర్తెరగాలి. దీనినే డీ హైడ్రేషన్ అంటారు.

డీ హైడ్రేషన్ | Dehydration

ఒక వ్యక్తి డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు వెంటనే ఓఆర్ఎస్ ఇస్తారు. తద్వారా సదరు వ్యక్తి శరీరంలో నీటిస్థాయి పెరుగుతుంది. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం ద్వారా అతడి ప్రాణాలు నిలబడతాయి. నీటిస్థాయి కొరత అధిగమించేందుకు ఓఆర్ఎస్ ఓ ఔషధంలా పని చేస్తుంది.

సాధారణంగా మానవుడు తన శరీరంలో 2 శాతం నీటిస్థాయి కొరత ఉంటేనే దాహార్తికి గురువుతాడు. ఇంకో స్థాయి పెరిగి 3 శాతం నీటి కొరత ఏర్పడితే హ్యూమాన్ బాడీలో బర్నింగ్ ప్రారంభమవుతుంది. అది మెల్లగా ఆకలి స్థాయిని మందగింపజేస్తుంది. సదరు వ్యక్తి చర్మం ఎర్రగా మారి, బాడీ ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఈ పరిస్థితులు కేవలం 4 శాతం నీటి స్థాయి కొరత ఉంటేనే రాగా, ఇక 5 శాతానికి కొరత ఉంటే ఆ వ్యక్తికి జ్వరం రావడంతో పాటు తలనొప్పి మొదలవుతుంది. నీటికొరత స్థాయి 5 నుంచి 8కి చేరితే మూర్ఛ వస్తుంది. అదే ఇక 20 శాతానికి చేరే వ్యక్తి మరణించొచ్చు. కాబట్టి ప్రాణాధారమైన నీటిని సేవించడం ప్రతీ ఒక్కరు ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి.

డీ హైడ్రేషన్ లక్షణాలు:

  • తలనొప్పి.
  • మైకము లేదా తేలికపాటి తలనొప్పి.
  • నిద్ర.
  • మూత్రవిసర్జన తగ్గుతుంది.
  • ముదురు పసుపు- లేదా అంబర్-రంగు మూత్రం.
  • చర్మ స్థితిస్థాపకత తగ్గింది.
  • పొడి నోరు మరియు శ్లేష్మ పొర (పెదవులు, చిగుళ్ళు, నాసికా రంధ్రాలు)
  • అల్ప రక్తపోటు.

Source : Wikipedia >>  Dehydration