ఎప్పుడో మర్చిపోయిన బొగ్గు బ్రష్ ని ఎందుకు వాడాలో తెలుసా..?

-

కరోనా కారణంగా చాలా పాతకాలం నాటి విధానాలు కొత్తగా పరిచయమయ్యాయి. రోగాల బారి నుండి రక్షించుకోవడానికి పాతకాలపు విధానాలకి మించినవి లేవని, వాటివల్లే కొత్త రోగాలు రాకుండా ఉంటాయని, అందువల్ల వాటిని వాడడం మంచిదని ప్రతీ ఒక్కరూ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా పాత అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరోగ్యాన్ని పెంచే అనేక పాత పద్దతులు తెర మీదకి వస్తున్నాయి. తాజాగా బొగ్గు బ్రష్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. దంతాల ఆరోగ్యం గురించి బాధపడేవాళ్ళు బొగ్గు బ్రష్ గురించి తెలుసుకుంటున్నారు.

టూత్ పేస్టులు రాకముందు భారత దేశంలో చాలా మంది బొగ్గుతోనే పళ్ళు తోముకునేవారు. టూత్ పేస్ట్ వచ్చిన కొత్తల్లో బొగ్గుతో పళ్ళూ తోముకోవడం మంచిది కాదని ప్రచారం చేసారు. ప్రస్తుతం సహజ సిద్ధమైన వస్తువులకి గిరాకీ పెరుగుతుంది కాబట్టి, బొగ్గు బ్రష్ వెలుగులోకి వస్తుంది. బొగ్గు బ్రష్ వల్ల దంతాల్లు తెల్లగా ముత్యాల్లా మెరవడమే కాకుండా శ్వాసని తాజాగా ఉంచుతుంది. యాంటీ బాక్టీరియల్ గా పనిచేసి పళ్ళ మీద ఉండే పాచిని తొలగిస్తుంది.

ఈ బొగ్గు బ్రష్ ప్లాస్టిక్ తో కాకుండా వెదురు కర్రతో తయారవుతుంది. అందువల్ల అవి యాంటీబాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది. బొగ్గుతో కూడినటువంటి దాని పళ్ళు దంతాలకి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు దీన్ని రీసైకిల్ చేసిన మళ్ళీ ఉపయోగించవచ్చు. కాబట్టి, భూమిలో కలిసిపోదనే సమస్య ఉండదు. ప్రస్తుతం వాడుతున్న బ్రష్ లన్నీ ప్లాస్టిక్ తో అని అందరికీ తెలిసిందే. బ్రష్ పళ్ళు బొగ్గుతో తయారవుతాయి కాబట్టి, కాఫీ, టీ మరకలు చాలా ఈజీగా తొలగిపోతాయి.

ఐతే దీనివల్ల నష్టం లేదా అంటే ఉంది. కొంచెం రాపిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు బ్రష్ చేసుకునేటపుడు వాష్ బేసిన్ మొత్తం మరకలతో నిండిపోయే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news