ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!

-

చాలా మంది ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తూ ఉంటారు. సిస్టం ముందు ఎక్కువ సేపు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ సేపు లాప్టాప్ల ముందు కూర్చుని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజానికి ఇలా పని చేసేవారు కచ్చితంగా మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.

పూర్వం రోజులు మారిపోయాయి ఇదివరకు కష్టపడి పనులు చేసుకునే వారు ఎక్కువసేపు నడవడం మొదలైన వాటి వలన శారీరకంగా దృఢంగా ఉండేవారు. కానీ ఈ కాలంలో అలా లేదు. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వేగంగా వస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఆ సమస్యల గురించి చూద్దాం.

బరువు పెరిగిపోవడం:

ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు కూర్చుని పనిచేయకండి. మధ్య మధ్యలో లేస్తూ ఉండండి.

హృదయ సంబంధిత సమస్యలు:

ఇలా పని చేసే వారిలో హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. గుండెపోటు, స్ట్రోక్ మొదలైన సమస్యలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాళ్లు బలహీనంగా మారడం:

ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల కాళ్ల కండరాలు, దిగువ శరీరం క్రియా రహితంగా మారతాయి దీనితో కాళ్ళకి సమస్యలు వస్తాయి. అలానే బలహీనత ఏర్పడుతుంది.

నొప్పులు రావడం:

ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన నొప్పులు వస్తూ ఉంటాయి. ఒకే పోస్టర్ లో కూర్చోవడం లేదంటే తప్పు పోస్టర్ లో కూర్చోవడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి.

నరాల సమస్య:

నరాల సమస్య కూడా ఎక్కువసేపు కూర్చుని పని చేసే వాళ్లలో కలుగుతుంది కనుక మధ్య మధ్యలో లేవడం కాసేపు గ్యాప్ ఇచ్చి పని చేయడం వంటివి చేస్తూ ఉండండి లేదంటే ఈ సమస్యలు కూడా తెచ్చుకున్నట్లే.

Read more RELATED
Recommended to you

Latest news