వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ ని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ ఇబ్బందులు వస్తాయట..!

-

ఉదయం పూట కాని సాయంత్రం పూట కాని వాకింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది. నిజానికి వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు మనం పొందవచ్చు. వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనం దరిచేరకుండా చూసుకోవచ్చు. అయితే చాలా మంది వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

మొబైల్ ఫోన్ లో గేమ్ ఆడుకోవడం లేదా చాట్ చేసుకోవడం లేదు అంటే హెడ్ ఫోన్స్ ధరించి పాటలు వినడం లాంటివి చేస్తూ వాకింగ్ చేస్తారు. అయితే అది నిజానికి చెడు అలవాటు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ని ఉపయోగించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే వాకింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.

బాడీ పోస్టర్లో సమస్యలు:

మొబైల్ ఫోన్ ని చూస్తూ నడవడం వల్ల మీ యొక్క బాడీ పోస్టర్ లో ఇబ్బందులు వస్తాయి. వెన్నెముక నిదానంగా ఉంచి నడవాలి. కానీ మొబైల్ ఉపయోగించినప్పుడు మనం తిన్నగా నడవకుండా బెండ్ అయి నడుస్తూ ఉంటే పోస్టర్ పాడవుతుంది.

మజిల్ పెయిన్స్:

మొబైల్ ఫోన్ ని పట్టుకుని నడపడం వల్ల మజిల్ పెయిన్ కూడా వస్తూ ఉంటాయి. కనుక మొబైల్ ఫోన్ ని వాకింగ్ చేసేటప్పుడు ఉపయోగించవద్దు.

వాకింగ్ పైన ఏకాగ్రత:

మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల వాకింగ్ లో ఏకాగ్రత తగ్గుతుంది. డిస్ట్రక్షన్ ఏర్పడుతుంది. అలానే మీరు ఎందుకు వాకింగ్ చేయాలనుకుంటున్నారో అది మొత్తం కూడా గాడి తప్పుతుంది. దీనితో అనుకున్నది చేయడం కూడా అవ్వదు.

బ్యాక్ పెయిన్:

మీరు కనుక మొబైల్ ఫోన్ లో ఉపయోగించి నడుస్తున్నారు అంటే కచ్చితంగా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అలానే మెడనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ కి దూరంగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news