బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ పని చేస్తుందా..?

-

చాలా మంది బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడలేని పద్ధతులని అనుసరిస్తూ ఎంతో శ్రమిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ముఖ్యమైన పదార్థం ఎసిటిక్ యాసిడ్. దీనిలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలానే బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…. మీరు సులువుగా సలాడ్ లో వేసుకుని తీసుకోవచ్చు లేదు అంటే ఒకటి రెండు స్పూన్స్ భోజనానికి లేదా టిఫిన్ కి ముందు తీసుకోవచ్చు.

apple cider vinegar

బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పని చేస్తుంది. స్టడీస్ ప్రకారం ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతాయి అని చెప్పారు. అలానే కొవ్వును కరిగించడంలో కూడా ఇది పని చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే లాభాలు:

చర్మ సౌందర్యానికి :

ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడం వల్ల పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలానే బ్యాక్టీరియాని కూడా ఇది చంపేస్తుంది.

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ మేనేజ్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం కూడా ఇది చేస్తుంది.

ఇన్సులిన్ ను ఇంప్రూవ్ చేస్తుంది:

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మ్యానేజ్ చేసుకోవచ్చు.

వైరస్, బాక్టీరియాలని చంపుతుంది:

ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల చెడు వైరస్ మరియు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

ఎక్కువ ప్రయోజనాలు వున్నా ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే రోజుకి 10 నుంచి 30ml వరకు మాత్రమే తీసుకోవాలి. దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల గొంతులో ఇరిటేషన్, పళ్ళ పై పొర పోవడం వంటివి జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version