ఉపవాసం వల్ల నిజంగా బరువు తగ్గుతారా..? అలా చేయడం కరెక్టేనా..?

-

పండగలకు చాలామంది ఉపవాసం చేస్తుంటారు.. ఏదైనా కోరుకుని అది నెరవేరితే ఇన్ని వారాల పాటు ఉపవాసం ఉంటా అని దైవచింతనతో ప్రార్థిస్తారు. ఉపవాసం చేయడం ఎంతవరకు మంచిది, ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారా, పెరుగుతారా..? కష్టపడి వ్యాయామాలు చేసి బరువు తగ్గడం ఒక పద్ధతి అయితే హెల్తీ డైట్‌ ఫాలో అవుతూ.. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తూ బరువును తగ్గించుకోవడం ఇంకో పద్దతి..

ఉపవాసం అంటే రోజులో ఏదో ఒక సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండడం. ఇలాంటప్పుడు బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలన్నింటిని బాడీ డీటాక్సిఫై చేసుకుంటుంది.ఎలా అయితే మనం ఆదివారం రోజు స్కూల్ బ్యాగ్‌ సర్ధుకోవడం, రూం క్లీన్‌ చేసుకోవడం, బట్టలు సర్దుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తామో అలా.. బాడీ కూడా ఉపవాసం ఉన్న రోజు శరీరంలో చిందరవందరగా పడిఉన్న కొవ్వులను క్లీన్‌ చేస్తుంది. అలా బరువు తగ్గొచ్చునమాట.!

ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్‌..?

బరువు తగ్గడానికి ఉపవాసం ఆరోగ్యకరమైన మార్గమా అంటే..దీన్ని ఎక్కువ కాలం పాటిస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇది డైటింగ్ నావిగేటింగ్ మార్గం అని అంటారు. మీరు ఆరోగ్యకరమైన బరువు, మంచి శరీరాన్ని పొందాలనుకుంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.. ఉపవాసం వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది, దాని వల్ల శరీరానికి పని చేసే శక్తి ఉండదు.. పరిమిత ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల శరీరం, మనస్సు రెండూదెబ్బతింటాయి. దీని కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. దీని వల్ల అలసట తలనొప్పి సమస్య పెరుగుతుంది. మీరు ఉన్న బరువుబట్టి వారానికి ఒకసారా లేదా నెలకు ఒకసారా ఇలా ప్లాన్‌ చేసుకోవాలి కానీ, వారినికి రెండుమూడు రోజులు ఉపవాసం ఉంటా అంటే..లేనిపోని రోగాలను కొనితెచ్చుకున్నట్లే.. అలాగే ఉపవాసం ఉన్నరోజు కూడా లెమన్‌, హనీ, నిమ్మరసం కలిపిన వాటర్‌ను తాగాలి. దానివల్ల బాడికి శక్తి లభిస్తుంది. అలసటగా అనిపించదు.

Read more RELATED
Recommended to you

Latest news