గోజీ బెర్రీల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందేమో.. ఉన్నది ఒక్కటే జీవితం.. అందులోనే అన్నీ అనుభవించాలి. కానీ మనం ఎప్పుడూ తినేవే తప్ప కొత్తగా ఏది ట్రై చేయం.. అసలు ఇన్ని ఉంటాయా అని కూడా మనకు తెలియదు. ప్రకృతి ఇచ్చిన వాటిల్లో మనకు తెలిసినవి కొంతైతే..అందులో మనం తినేవి ఇంకా కొంచెం. తినకపోయినా సరే.. అన్నింటి పైన అవగాహ పెంచుకోవడం అయితే మంచిదే కదా.. అందులో భాగంగానే ఈరోజు గోజీ బెర్రీల గురించి మాట్లాడుకుందాం..
ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయస్సు పైబడినవారే కాదు.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి.. ఇలా ఇబ్బందులు పడుతున్నవారు గోజి బెర్రీలను డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచదిట.
డ్రైడ్ గోజి బెర్రీస్’ అని సెర్చ్ చేస్తే.. ఇవి ఆన్‌లైన్ మార్కెట్ లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లానే వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కేజీ క్వాలిటీని బట్టి తీసుకుంటే.. రూ.1500 వరకు ఉంటుంది. లైసియం చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు ఈ పండ్లు కాస్తాయట.
వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. చైనీయులు అయితే వీటిని చిరుతిండిగా ఉపయోగిస్తారు. సూప్‌లో వేసుకుని తింటారు. వీటిని తిన్న వెంటనే.. ఇన్స్టెట్ ఎనర్జీ వచ్చేస్తుంది. శరీరానికి జియాక్సంతిన్ ఇస్తుంది. టిబెట్(Tibet), చైనా(China)లలో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ ఫ్రూట్స్‌ను హిమాలయన్ గోజి, టిబెటన్ గోజి అని కూడా అంటారు.. రోజుకో పది ఎండు గోజి బెర్రీలను తింటే కంటి సమస్యలు తగ్గుతాయట. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో కూడా గోజి బెర్రీల వల్ల కలిగే లాభాల గురించి ఓ అధ్యయనం ప్రచురితమైంది.
ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్లల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా కాపడతాయట. . గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో తెలిపారు.
గమనిక: వీటిని వాడాలనుకునే వారు మీ వైద్యలను సంప్రదించి ఆపై తీసుకోగలరు.
-Triveni Buskarowthu