అరటిపండ్లు ఎక్కువగా తినకూడదా…?

-

మన తెలుగు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కువగా ఏడెనిమిది రకాల అరటిపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. నీటి శాతం తక్కువగా ఉండే ఈ పండ్లలో కెలోరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వంద గ్రాముల అరటిపండులో రకాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై కెలోరీల శక్తి మనకు లభిస్తుంది. అరటిపళ్ళలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పిండి పదార్థాలు చక్కెర రూపంలోనూ, పీచు రూపంలోనూ లభిస్తాయి కొవ్వు పదార్థాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా అరటిపళ్ళ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ 45-58 మధ్య మాత్రమే ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని పెంచే అవకాశం ఉండదు. మధుమేహం ఉన్న వారు మాత్రం భోజనం చేసిన వెంటనే అరటిపండు తినకూడదు.

ఈ పండ్లలోని పీచుపదార్థం పెద్ద పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. అరటిపళ్లలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి ఆవశ్యకమైన ఖనిజమని వైద్యులు చెప్తున్నారు. విటమిన్‌ బి- 6, విటమిన్‌- సి అరటిపళ్ళలో అధికంగా ఉంటాయి. డోపమిన్‌, కాటచిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ పళ్ళలో అధికంగా ఉంటాయి. పండించిన నేలను బట్టి పోషక విలువలు మారుతూ ఉంటుంది. చక్కెరకేళి అయినా మరేదైనా మితంగా తీసుకుంటే మంచిది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news