టాలీవు నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ కు అధికారిక తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా మరొక సినిమాలో నటించనున్నారు పవన్ కళ్యాణ్. ఒక పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా ఫీల్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గజ దొంగగా నటిస్తున్నట్లు టాక్ .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇక ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో సెట్స్ కూడా సిద్ధం చేసిందట సినిమా యూనిట్.
ఇకపోతే ఈ రెండింటితో పాటు ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరొక సినిమాకు ఓకే చెప్పిన పవన్, దానిని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించనున్నారు. గతంతో పవన్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ కొట్టిన హరీష్, ఈ సారి మంచి కథను ఆయన కోసం సిద్ధం చేస్తున్నట్లు టాక్. అయితే గబ్బర్ సింగ్ సినిమా, అంతకముందు బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా వచ్చిన దబాంగ్ కు రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం పవన్ కోసం రీమేక్ కాకుండా డైరెక్ట్ కథని తానే రాసుకుంటున్నాడట హరీష్.
అందుకోసం ఒక తెలంగాణ విప్లవ వీరుడి జీవితాన్ని బేస్ చేసుకుని సిద్ధం చేస్తున్న ఆ కథలో మంచి యాక్షన్, ఎమోషన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండనున్నాయట. రెండవ సారి తమ కంబోలో రాబోతున్న సినిమా కాబట్టి భారీ రేంజ్ లో అంచనాలు ఉండడం ఖాయం అని, తప్పకుండా ఆ అంచనాలు అనుకునేలా సినిమా తీస్తానని హరీష్ చెప్తున్నట్లు టాక్. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే…..!!