ఒత్తిడి మొదలు అజీర్తి సమస్యల వరకు సైంధవ లవణంతో మాయం..!

సైంధవ లవణం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, ఐరన్, క్యాల్షియం, జింక్, మెగ్నిషియం మొదలైనవి ఇందులో ఉంటాయి. సైంధవ లవణం ని వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

అజీర్తి సమస్యలు వుండవు:

జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా సైంధవ లవణం చూసుకుంటుంది. అలానే ఇది కడుపునొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. అలానే స్టమక్ ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుంచి బయటపడేస్తుంది. ఆయుర్వేద మందులలో కూడా దీనిని ఉపయోగిస్తారు. బ్లోటింగ్, కాన్స్టిపేషన్ వంటి వంటి నుండి బయట పడేస్తుంది.

తలనొప్పి మరియు మైగ్రేన్ తగ్గుతుంది:

తలనొప్పిని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం తో కూడి ఉన్న నూనెను మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.

మజిల్స్ కి మంచిదే:

మజిల్ ఫంక్షన్ కి బాగా జరిగేలా ఇది చూసుకుంటుంది. అలానే మజిల్ పెయిన్స్ వంటి వాటి నుంచి కూడా బయట పడేస్తుంది.

ఒత్తిడి ఉండదు:

మీరు స్నానం చేసేటప్పుడు ఒక స్పూన్ సైంధవ లవణాన్ని బకెట్ లో వేసుకుని స్నానం చేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. అలానే డయాబెటీస్ వాళ్లకి కూడా మంచిది.

బీపీ తగ్గుతుంది:

మీరు సాల్ట్ కి బదులుగా సైంధవలవణం వాడితే బీపి కంట్రోల్ లో ఉంటుంది ఇలా ఎన్నో లాభాలని మనం సైంధవ లవణంతో పొందొచ్చు.