భోజనంలో పెరుగుతో పాటు వీటిని తింటే బరువు తగ్గొచ్చు..!

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పెరుగు తో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు (Weight Loss) మరియు రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బరువు తగ్గడానికి కొన్ని విషయాలు నిపుణులతో షేర్ చేసుకున్నారు. మరి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు వల్ల చాలా మంచి మనకి కలుగుతుంది. దానిలో క్యాల్షియం, ఐరన్, రైబోఫ్లెవిన్, విటమిన్ బి6, విటమిన్ బి12, హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి.

పెరుగుతో పాటు ఏమి తీసుకోవాలి..?

పెరుగుతో పాటు సోంపు పొడి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. సొంపు లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంని పెంచుతుంది. కొవ్వుని కూడా ఇది కరిగించడంలో సహాయ పడుతుంది. కాబట్టి పెరుగు తో పాటు మెంతులు పొడి తీసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది.

అదే పెరుగు లో పసుపు వేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకో వచ్చు. బీపీ, ఫైల్స్ మరియు డైజషన్ కి పెరుగు సహాయ పడుతుంది. పెరుగు లో కూలింగ్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అజీర్తిని పోగొడుతుంది. ఇలా పెరుగు తో ఈ బెనిఫిట్స్ ని పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.