పర్సు తెచ్చిన కష్టాలు.. అబ్బాయిలూ.. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌తో జాగ్రత్త..!!

-

అమ్మాయిలు బయటకు వెళ్తే… హ్యాండ్‌ బ్యాగ్‌ కచ్చితంగా క్యారీ చేస్తారు.. అబ్బాయిలైతే పర్స్‌ మెయింటేన్‌ చేస్తారు. బ్యాక్‌ పాకెట్‌లో పర్సు పెట్టుకుంటారు. అలాగే కుర్చుంటారు. ఇలా బ్యాక్‌ పాకెట్‌లో పర్సులు పెట్టుకోవడం వల్ల అబ్బాయిలకు కొన్ని సమస్యలు వస్తాయట.. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పర్సు కారణంగానే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడనే విషయం తెలిసింది. ఓ 30 ఏళ్ల వ్యక్తి.. మూడు నెలల పాటు కుడి పిరుదు నుండి కాలు, పాదం వరకు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అతడికి ‘వాలెట్ న్యూరిటిస్’ లేదా ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కుర్చున్నా, పడుకున్నా నొప్పి ఘోరం..

కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుందని, నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నొప్పి తక్కువగా ఉంటుందని రోగికి చికిత్స చేసిన వైద్యుడు చెప్పాడు. అతడి తొడ వెనక భాగం నరాలు కాస్త దెబ్బతిన్నాయట. ఆ వ్యక్తి తన కుడి వెనక జేబులో ఎప్పుడూ లావుగా ఉండే వాలెట్‌ని తీసుకెళ్లేవాడు. ఆఫీసులో అతడు కూర్చొన్నంతసేపు…అది జేబులో ఉండిపోయేదట..

బ్యాక్‌ జేబులో పర్సు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు..

  • బ్యాక్ పెయిన్(Back Pain),
  • పిరుదుల్లో నొప్పి
  • మోకాలు, అరికాళ్ల నొప్పి, తిమ్మిరి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయ్.
  • దీనినే ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అంటారు. ఇలా పర్సును ఎక్కువ సేపు అలానే వెనకలా పెట్టుకుని కూర్చొంటే..
  • కండరాల స్థితి మీద ప్రభావం పడుతుంది.
  • తొడ వెనక భాగంలో నరాలు, పిరిఫార్మిస్ కండరాలకు కుదించుకుపోతాయి.
  • కండరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాలు కుదించుకుపోతాయి.

ఈ సమస్యలు ఎదుర్కొనేవారు.. కూర్చున్నప్పుడు లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ వెనక జేబులో నుంచి మీ వాలెట్ తీసి, మీ ముందు జేబులో లేదా జాకెట్‌లో ఉంచుకోండి..ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వాలెట్ పరిమాణం కూడా మరీ పెద్దగా ఉండొద్దు. ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు.. తమ వాలెట్లను తమ వెనక జేబులో పెట్టుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ లక్షణాలు..

  • కూర్చోవడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పి ఉంటుంది.
  • కాలు మీద సూదులు గుచ్చినట్లుగా అనిపిస్తుంది.
  • పాదంలో తిమ్మిరి నడవడంలో ఇబ్బంది కూడా వస్తుంది.

పర్సుల్లో అవసరం లేని వాటిని తీసేయండి.. వీలైనంత వరకు ముందు జేబులోనే పర్సను పెట్టుకోవడానికి ట్రై చేయండి. డ్రైవ్‌ చేసేప్పుడు, కుర్చున్నప్పుడు, పడుకునేప్పుడు పర్సును పక్కనపెట్టండి.!

Read more RELATED
Recommended to you

Latest news