బీఆర్ఎస్ కి షాక్.. కేటీఆర్ కి సృజన్ రెడ్డి నోటీసులు..!

-

తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు అందించారు సృజన్ రెడ్డి. తప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ ఆరోపణలు చేశారు.

మృత్ టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆయన బంధువులకు మోసపూరితంగా కాంట్రాక్టులు దక్కేలా చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి బావ మరిది సృజన్ రెడ్డి అని.. కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. అదేవిధంగా ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా కేటీఆర్ కి ఎవ్వరో తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news