కందగడ్డ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా…?

-

కందని చాలా తక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది కూడా. దీనిని మీ డైట్ లో చేర్చితే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి క్యాన్సర్ ను అడ్డుకోవడానికి గుండె సమస్యలను తొలగించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇలా ఎన్నో విధాలుగా ఇది ఉపయోగ పడుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కంద దుంప తీసుకోవడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల మీరు ఫిట్ గా అవ్వొచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్న ఫైబర్ బరువు తగ్గిస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని కందదుంప పెంచుతుంది. అలానే కీళ్ల నొప్పులను నివారిస్తుంది. వారానికి రెండు సార్లు మహిళలు కందని తీసుకోవడం మంచిది. అలానే యాంటి ఏజింగ్ లక్షణాలు కంద లో ఉన్నాయి. ముసలితనం త్వరగా రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖం పై ఉన్న ముడతలు కూడా తగ్గిస్తుంది.

కంద లో ఫైబర్ ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. బాడీ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగనివ్వకుండా ఇది ఉంచుతుంది. ఇలా ఇది షుగర్ పేషెంట్లుకు సహాయం చేస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఎంతో చక్కగా తినొచ్చు. మతిమరుపు సమస్య ఉంటే కంద తో తొలగించుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, సెలీనియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెమరీ పవర్ ని పెంచుతాయి. అలానే ఇమ్యూనిటీ పవర్ ని కూడా కంద తో పెంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news