శిశువులు ఏడ్చినా.. కన్నీళ్లు ఎందుకు రావు అంటే..?

-

బాగా చిన్న పిల్లలు ఎక్కువ సేపు ఏడుస్తూ ఉంటారు. పైగా ఎంత ఏడ్చినా ఒక చుక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. కానీ వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఆపకుండా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు చిన్న పిల్లలు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు..? దాని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. పుట్టిన పసిపిల్లలు ఏడ్చిన నవ్వినా కన్నీళ్లు రావు. మనకి మామూలుగా గట్టిగా నవ్వినా లేదంటే కొంచెం ఏడ్చిన కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి అలా కాదు.

ఎందుకు అప్పుడే పుట్టిన పిల్లలకి లేదంటే బాగా చిన్న పిల్లలకి కళ్ళ నుండి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు అనే దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు కన్నీళ్ళకి ఒక ప్రత్యేక వాహిక ఉంటుంది. అయితే నవజాత శిశువుల్లో ఈ వాహిక పూర్తిగా అభివృద్ధి చెందదు.

ఈ కారణం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ఎంత సేపు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. ఇక అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే కన్నీళ్లు రావడం మొదలు అవుతుంది ఇది అభివృద్ధి చెందడానికి రెండు వారాల వరకు సమయం పడుతుంది అని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ వాహిక అభివృద్ధి చెందడానికి రెండు నెలలు కూడా పట్టచ్చు. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల్లో కన్నీళ్లు రావు ఎంత ఏడ్చినా కూడా పిల్లల కళ్ల నుండి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news