Breaking : గద్దర్‌ భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళి

-

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. కాసేపట్లో మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు.

అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

అంతకుముందు ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, గన్ పార్క్, ప్యాట్నీ, జేబీఎస్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు అంతిమ యాత్ర జరిగింది. గద్దర్ కడచూపు కోసం అభిమానులు, కవులు కళాకారులు భారీగా తరలివచ్చారు. రోడ్లన్ని కిక్కిరిసి పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news