Independence Day : మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గాంధీ దూరంగా ఉన్నారు.. ఎందుకో తెలుసా..?

-

బ్రిటీష్ వారు భారతదేశాన్ని క్రమ క్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలపై తమ ప్రభావాన్ని చూపారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. దీంతో.. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు.

ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. అయితే.. మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జాతిపిత మహాత్మాగాంధీ దూరంగా ఉన్నారు. ఈ విషయం ఇప్పటివారిలో చాలా మందికి తెలీదు. అయితే.. బ్రిటీష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లాకా.. కొన్ని చోట్ల హిందు ముస్లింల మధ్య గొడవులు జరిగాయి. అయితే.. స్వతంత్రం వచ్చిన రోజున మహాత్మాగాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి జాతిపిత నిరాహారదీక్ష చేస్తున్నారు.

అయితే… ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం కానుండగా.. మీరు జాతిపిత. ఈ వేడుకల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరుతూ.. లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఈ లేఖకు ప్రత్యూత్తరంగా.. గాంధీ సమాధానం ఇస్తూ… కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అంటూ లేఖలో బదులు పంపారు. జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news