ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడిపోయారు. పిల్లలు కూడా ఫోన్ అడుగుతున్నారు. అయితే పిల్లలు ఫోన్ ఉపయోగించడం వలన చాలా నష్టాలు ఉంటాయి. పిల్లలు ఎక్కువగా ఫోన్, టీవీ వంటి వాటికి అలవాటు పడిపోతే ఏ విషయాలను నేర్చుకోలేరు. పైగా ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గిపోతుంది. అవసరానికి మాత్రమే ఫోన్ ని ఉపయోగించాలి. అయితే ఒక్కసారిగా పిల్లల్ని మొబైల్ ఫోన్ కి దూరంగా ఉంచలేరు. ఆదివారంనాడు సెలవు వస్తుంది అలాంటప్పుడు ఎక్కువగా ఫోన్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. పిల్లలు ఫోన్ కి పూర్తిగా దూరంగా ఉంటే మంచిది. ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి సరదాగా ఫ్యామిలీతో గడపడం అలవాటు చేసుకోండి.
ఇలా చేయడం వలన ఎక్కువసేపు వాళ్ళు మీతో ఆడుకుంటారు. అనేక విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు మొబైల్ ఫోన్ కనపడకుండా దాచి పెట్టండి. సెల్ ఫోన్ ని పక్కన పెట్టి పిల్లలతో పాటుగా టీవీలో మంచి ప్రోగ్రామ్ చూడడం లేదంటే వాళ్లకి నచ్చిన సినిమా పెట్టడం వంటివి కూడా చేయొచ్చు. పిల్లలకి పుస్తకాలు చదవడం కూడా అలవాటు చేయడం మంచిది. దగ్గరలో లైబ్రరీ ఉంటే పిల్లలకు అలవాటు చేయొచ్చు. లైబ్రరీకి తీసుకువెళ్లడం లేదా పక్కన పార్కు ఉంటే పార్కులో ఆడించడం వంటివి చేయొచ్చు. లేదంటే సరదాగా వాళ్ళతో ఇండోర్ గేమ్స్ ఆడితే కూడా బావుంటుంది.
చల్లబాటు వేళ అవుట్ డోర్ గేమ్స్ ఆడించొచ్చు. చిన్న చిన్న పనులు నేర్పించడం, వంట నేర్పడం వంటివి చేయొచ్చు. మరీ చిన్న పిల్లలకు గ్యాస్ వెలిగించకుండానే వంటలు నేర్పించవచ్చు. లెమన్ జ్యూస్ చేయడం లేదంటే మరి ఏమైనా గ్యాస్ అవసరం లేకుండా ఉన్న వంటకాలు చేయించడం వంటివి చేయొచ్చు. ఇలా ఫ్యామిలీతో సరదాగా పిల్లలు గడిపితే హ్యాపీగా ఉంటారు. ఫోన్ కూడా అడగరు. పిల్లలు మనతో ఆడుకోవాలంటే మనం ఇష్టంగా పిల్లల్ని ఆడించాలి. బాధ్యతగా బరువుగా కాకుండా ప్రేమతో పిల్లల్ని ఆడిస్తే ఎంతసేపైనా ఆడుకోవచ్చు.